: 'బ్యాడ్ గర్ల్స్' ఏం చేస్తారు? సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న పోస్టర్!
ఒక 'బ్యాడ్ గర్ల్' ఏం చేస్తుందన్న విషయాన్ని స్కూల్ విద్యార్థులకు సులువుగా చెప్పేందుకు విడుదల చేసిన పోస్టర్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. మామూలుగా బ్యాడ్ గర్ల్ ఏం చేస్తుంది? అని అడిగితే స్మోకింగ్, డ్రింకింగ్ వంటివి చెబుతాం. ఇంకా లోతుగా వెళితే రాత్రిళ్ళు శృంగార చిత్రాలు చూస్తారని అంటాం. కానీ ఈ చార్టును మరింత విశ్లేషణాత్మకంగా తయారు చేయడంతోనే దీనికింత ప్రచారం వచ్చింది. ఎప్పుడూ అద్దానికే పరిమితమై అందం చూసుకోవడంతో మొదలుపెట్టి, ఆకర్షణీయ శరీరం కోసం తహతహ లాడటం, పార్కుల్లో బహిరంగంగా ప్రేమకలాపాలు సాగించడం, అధికంగా లేదా అతి తక్కువగా తినడం, చపాతీలు గుండ్రంగా చేయలేక పోవడం, గోవా వెళ్ళాలని కలలు కనడం, జుట్టును విరబోసుకొని బయట షికార్లకు వెళ్ళడం వంటివన్నీ బ్యాడ్ గర్ల్స్ లక్షణాలని ఈ చార్టు చెబుతోంది.