: కేఫ్ కాఫీ డేలో నిలేకనీ, ఝున్ ఝున్ వాలా రూ.100 కోట్ల పెట్టుబడి!
పబ్లిక్ ఇష్యూకు వెళ్లబోతున్న 'కేఫ్ కాఫీ డే'కు సరికొత్త ఉత్సాహం వచ్చేసింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగానే కాక ఆధార్ కార్డుల జారీ సంస్థకు కూడా నేతృత్వం వహించిన నందన్ నిలేకనీ, కేవలం పెట్టుబడులతో భారీగా సంపద కూడబెట్టిన రాకేశ్ ఝున్ ఝున్ వాలాలు కేఫ్ కాఫీ డేలో రూ.100 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. దీంతో త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానున్న సదరు కంపెనీ విలువ బారీగా పెరగనుంది. ఈ పెట్టుబడులను ఝున్ ఝున్ వాలా ధ్రువీకరించగా, నిలేకని మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. డీ-మార్ట్ అధినేత రాధాకృష్ణన్ దామానీ కూడా త్వరలో కేఫ్ కాఫీ డేలో కొంతమేర వాటా కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారట. ఈ ముగ్గురు వ్యాపారవేత్తల స్నేహితుడే కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ.