: మార్చిలో ప్రధాని శ్రీలంక పర్యటన


ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చిలో శ్రీలంకలో పర్యటించే విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆరోగ్య శాఖ మంత్రి, కేబినెట్ అధికార ప్రతినిధి రజిత సెనార్ట్న్ మాట్లాడుతూ, మార్చి 13న మోదీ శ్రీలంక వస్తారని తెలిపారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటిస్తారని చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో మోదీ లంకకు రానున్నారని, 25 ఏళ్లలో ఓ భారత ప్రధానమంత్రి ఇలా పర్యటించడం తొలిసారని పేర్కొన్నారు. లంకకు అధ్యక్షుడయ్యాక మైత్రిపాల సిరిసేన తొలిసారి న్యూఢిల్లీ వచ్చి వెళ్లిన తరువాత ఈ పర్యటన ఖరారైంది.

  • Loading...

More Telugu News