: వారంలో తేల్చండి... లేదంటే మూసేస్తాం: టీ సర్కారుకు ఇంజినీరింగ్ కాలేజీల అల్టిమేటం
‘‘వారంలోగా మీ నిర్ణయం చెప్పండి. లేదంటే కళాశాలలను నిరవధికంగా మూసేస్తాం’’ అంటూ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు తెలంగాణ సర్కారుకు అల్టిమేటం జారీ చేశాయి. జేఎన్టీయూ- హైదరాబాదు అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదిక ఆధారంగా 16 ఇంజినీరింగ్ కళాశాలలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ తరగతులను నిర్వహించుకునేందుకు అనుమతులు మంజూరు చేయాలని కళాశాల యాజమాన్యాల సంఘం డిమాండ్ చేసింది. అంతేకాక తగ్గించుకున్న సీట్ల సంఖ్యతోనే మరో 146 కళాశాలలకు అనుమతులు మంజూరు చేయాలని కూడా యాజమాన్యాల సంఘం డిమాండ్ చేసింది. తమ డిమాండ్ల సాధనకు సంబంధించి ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీగా ఆందోళనలు చేపడతామని చెప్పిన సంఘం, చివరి అస్త్రంగా కళాశాలల మూసివేతకు దిగుతామని హెచ్చరించింది.