: రాజధానికి భూసమీకరణపై హైకోర్టులో పిటిషన్
రాజధాని భూసమీకరణపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ నుంచి ప్రభుత్వ అధికారులు బలవంతంగా భూములు సేకరిస్తున్నారని మంగళగిరి, తాడేపల్లి రైతులు పిటిషన్ వేశారు. స్పందించిన కోర్టు ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలని అడిషనల్ జనరల్ కు సూచించింది. ఇప్పటికే భూసేకరణపై పలు రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు కొంతమంది రైతులు కూడా భూములు ఇవ్వబోమని అంటున్నారు.