: దగ్గుతున్న కేజ్రీవాల్ కు ప్రధాని మోదీ సలహా!
ఎడతెరిపి లేకుండా దగ్గుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ సలహా ఇచ్చారట. ఇటీవల వీరిద్దరూ పాల్గొన్న ఒక సమావేశంలో కేజ్రివాల్ అవస్థలు గమనించిన ఆయన ఓసారి యోగా గురు డాక్టర్ నాగేంద్రని కలవమని సూచించారట. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచీ ఆయన వద్ద చికిత్స పొందుతున్నట్టు తెలిపారట. ఈ సలహాను స్వీకరించిన కేజ్రీవాల్ త్వరలోనే యోగా గురును కలవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కాగా, కర్ణాటకకు చెందిన 72 సంవత్సరాల నాగేంద్ర, తాను స్థాపించిన స్వామి వివేకానంద యోగా అనుసంధాన్ సంస్థాన్ ద్వారా దాదాపు రెండు లక్షల మంది ఆస్తమా రోగులకు చికిత్స అందించారు.