: మెక్ 'కల్లోలం'... చేష్టలుడిగిన ఇంగ్లాండ్... న్యూజిలాండ్ విజయం


ఇంగ్లండ్ తమ ముందు ఉంచిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్ గా వచ్చిన కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ మైదానంలో పరుగుల సునామీని సృష్టించాడు. 25 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్ లు బాదిన మెక్ కల్లమ్ మొత్తం 77 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తరువాత 10వ ఓవర్లో గుప్తిల్ సైతం వోక్స్ వేసిన బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆపై మరో వికెట్ కోల్పోకుండానే న్యూజిలాండ్ 12.2 ఓవర్లలో 125 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 7 వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్ సోథీకి 'మాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. కాగా, ఈ వరల్డ్ కప్ లో కివీస్ కు ఇది వరుసగా మూడో విజయం. ఇప్పటికే శ్రీలంక, స్కాట్ ల్యాండ్ లపై వీరు గెలిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News