: బ్రిటన్ పైకి రష్యా బాంబర్లు... అడ్డుకునేందుకు రంగంలోకి యుద్ధవిమానాలు


ఇంగ్లాండ్ నైరుతీ ప్రాంతంలోని కార్న్ వాల్ తీరానికి రష్యా బాంబర్లు రావడంతో, వాటిని అడ్డుకునేందుకు బ్రిటన్ హుటాహుటిన యుద్ధవిమానాలను మోహరించింది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంగ్లాండ్ తూర్పు ప్రాంతంలోని ఎయిర్ బేస్ నుంచి రెండు టైఫూన్ రకం యుద్ధ విమానాలను పంపామని, రష్యా బాంబర్లు బ్రిటన్ పరిధిని దాటేవరకూ అవి కాపలా కాశాయని తెలిపింది. ఈ ఘటన బుధవారం జరిగిందని పేర్కొంది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడం తప్పని తెలిసినా, తమ తీర ప్రాంతంలో రష్యా విమానాలు అప్పుడప్పుడూ తిరుగుతున్నాయని వివరించింది. ఈ మొత్తం ఘటనను ప్రధాని డేవిడ్ కామెరాన్ మాత్రం తేలికగా కొట్టిపారేశారు. రష్యా తమకేదో చెప్పాలని భావిస్తోందని, దీనిపై మరీ ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News