: వరల్డ్ కప్ లో మెక్ కల్లమ్ రికార్డు హిట్టింగ్... 25 బంతుల్లో 77 పరుగులు!


ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలోనే న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ బ్యాటింగ్ లో రికార్డు నమోదు చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మెక్ కల్లమ్, ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. మార్టిన్ గప్టిల్ తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన మెక్ కల్లమ్, 25 బంతుల్లోనే 77 పరుగులు రాబట్టాడు. ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్స్ లతో చెలరేగిన మెక్ కల్లమ్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఆ తర్వాత కూడా అతడిని ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. 308 స్ట్రయిక్ రేటుతో చెలరేగిన అతడి బ్యాటింగ్ ను ఇంగ్లండ్ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు.

  • Loading...

More Telugu News