: సౌతీ దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లండ్ బ్యాటింగ్... 123 పరుగులకు ఆలౌట్
వరల్డ్ కప్ మెగా టోర్నీలో సంచలనాల పరంపర కొనసాగుతోంది. నేటి ఉదయం వెల్లింగ్లన్ లో మొదలైన మ్యాచ్ లో కివీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ విలవిల్లాడింది. 33.2 ఓవర్లలోనే 123 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. కివీస్ బౌలర్ టిమ్ సౌతీ ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశాడు. ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ క్లీన్ బౌల్డ్ చేసిన సౌతీ, ఆ తర్వాత కూడా వికెట్ల వేటను కొనసాగించాడు. తొమ్మిది ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన సౌతీ, 33 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లలో జో రూట్ (46) మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. 124 పరుగుల విజయలక్ష్యంతో న్యూజిలాండ్ మరికొద్దిసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది.