: కర్మ కాలి పెద్ద మనిషిని అయ్యా... ఎట్ల పడితే అట్ల మాట్లాడలేను: తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్
‘కర్మ కాలి నేను కూడా పెద్ద మనిషిని అయ్యాను. నేను ఎట్ల పడితే అట్ల మాట్లాడడానికి అవకాశం లేదు. కంట్రోల్‌లో ఉండి మాట్లాడాలి’ అని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. కేవలం ఉద్యోగులు మాత్రమే సమ్మె చేయడం వల్ల తెలంగాణ కల సాకారం కాలేదని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ ఉద్యమంలో భాగం తీసుకున్నారని వివరించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో, వీడియోగ్రాఫర్లు సైతం ఉద్యమానికి చేయూతనిచ్చారని గుర్తు చేశారు. వీరందరికీ ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ఇప్పించాలని మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ లను స్వామిగౌడ్ కోరారు.