: తిరుమల వెంకన్న సేవలో ఏపీ సీఎం చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిన్న చిత్తూరు జిల్లా వెళ్లిన చంద్రబాబు నేటి ఉదయం తిరుమల చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన వెంకన్నను దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు. అనంతరం చంద్రబాబుకు వెంకన్న తీర్థ ప్రసాదాలను అందజేశారు.

  • Loading...

More Telugu News