: హైదరాబాదులో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాయాజాలం... జనం నెత్తిన రూ.15 కోట్ల మేర కుచ్చుటోపీ


హైదరాబాదు శివారు బీరంగూడలో మరో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం వెలుగు చూసింది. కేవలం 5 నెలల వ్యవధిలోనే రూ.15 కోట్ల మేర వసూలు చేసిన ఆదిత్య డిజైనర్స్ సంస్థ నిన్న బోర్డు తిప్పేసింది. సంస్థ నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించారు. దీంతో సంస్థ వద్ద డిపాజిట్ చేసిన ప్రజలు లబోదిబోమంటున్నారు. స్వల్పవ్యవధిలోనే అధిక వడ్డీలు ఇస్తామని ఆశచూపి డిపాజిట్లు సేకరించిన నిర్వాహకులు, రూ.15 కోట్లతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితులు సంస్థ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అనంతరం పోలీసులను ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదిత్య డిజైనర్స్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News