: చెలరేగిన టిమ్ సౌతీ... కష్టాల్లో ఇంగ్లండ్
వరల్డ్ కప్ లో భాగంగా కొద్దిసేపటి క్రితం వెల్లింగ్లన్ లో ప్రారంభమైన మ్యాచ్ లో కివీస్ బౌలర్లు చెలరేగుతున్నారు. మ్యాచ్ ప్రారంభంలోనే ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కివీస్ బౌలర్ టిమ్ సౌతీ 18 పరుగులకు ఒకరి చొప్పున ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ క్లీన్ బౌల్డ్ చేశాడు. సౌతీ ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోతున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 57 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇయాన్ బెల్, మొయిన్ అలీలతో పాటు మరో కీలక బ్యాట్స్ మన్ గ్యారీ బల్లాన్స్ కూడా పెవిలియన్ చేరాడు.