: ఆ సూట్ వేలం వేయొద్దు...మ్యూజియంలో పెట్టండి: శరద్ యాదవ్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన పది లక్షల బంద్ గళా సూట్ వేలానికి పెట్టడాన్ని ప్రతిపక్షనేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఆ సూట్ ను మ్యూజియంలో పెట్టాలని జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ సూచించారు. దానిని వేలం వేయడాన్ని ఆయన తప్పు పట్టారు. దానిని వస్తు ప్రదర్శన శాలలో ఉంచితే భవిష్యత్ తరాలు మన ప్రధానులు ధరించిన వస్త్రాల గురించి తెలుసుకునే అవకాశం కల్పించిన వారవుతారని అన్నారు. అలాగే భారత దేశానికి పర్యాటక రంగం సైతం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఆ సూట్ పలు వివాదాలకు కారణంగా నిలుస్తోంది. ఆ సూట్ పై ప్రధాని తన పేరును కుట్టించుకున్న సంగతి తెలిసిందే.