: స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు హ్యాకర్ల నుంచి ప్రమాదం ఉంది

హ్యాకర్లు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్ని టార్గెట్ చేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదులందుతున్నాయి. దీనిపై సాఫ్ట్ వేర్ నిపుణులతో పాటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లో వ్యక్తిగత సమాచారం నిలువ చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు. సాధారణంగా షాపింగ్ మాల్ కు వెళ్లినా, పెట్రోలు బంకులకు వెళ్లినా, లేదా, మనకు బ్యాంకుల పేరు చెప్పి వచ్చే ఫోన్ కాల్స్ కు మనం వివరాలు చెబుతుంటాం. ఈ వివరాల్ని ఆయా సంస్థలను మభ్యపెట్టి హ్యాకర్లు సేకరిస్తున్నారు. అక్కడ నుంచి దోపిడీకి పథకం సిద్ధం చేస్తారు. స్మార్ట్ ఫోన్ లో అందమైన అమ్మాయి ఫోటో పెట్టి ఓ మెసేజ్ పంపిస్తారు. వెంటనే ఆ నెంబర్ ను కంప్యూటర్ కు అనుసంధానిస్తారు. వారు పంపిన గుర్తుతెలియని మెసేజ్ నెంబర్ కు ఫోన్ చేస్తే అవతలి వారు ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పరు. 'హలో హలో' అంటూ మనం పెట్టేసే లోపే మన ఫోన్ లో నిక్షిప్తం చేసుకున్న సమాచారం మొత్తం సంగ్రహిస్తారు. ఆ తరువాత మనఫోన్ లో ఉన్న సమాచారం ఆధారంగా బ్లాక్ మెయిలింగ్ పర్వం ప్రారంభమవుతుంది. ఈ మధ్యకాలంలో ఇలా లక్షలు పోగొట్టుకున్న కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సైబర్ నేరాలు వెలుగు చూస్తున్నాయి.

More Telugu News