: చీమలు బాత్రూమ్ లు నిర్మించుకుంటాయి తెలుసా?
క్రమశిక్షణకు చీమలు మారుపేరు. అలాగే శ్రమశక్తికీ చీమలే ఆదర్శం. అలాంటి చీమలు మలవిసర్జనలో కూడా క్రమశిక్షణ కలిగి, మనుషులకు ఆదర్శంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. జర్మనీ పరిశోధకులు చీమలపై చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. నల్ల చీమల పుట్టల్లో అక్కడక్కడ ముదురు ఎరుపు రంగు చారలను పరిశోధకులు గుర్తించారు. వీటిని చీమల మలంగా గుర్తించారు. చీమలు తినే ఆహారం రంగులోనే మలం ఉంటుందని వారు తెలిపారు. అయితే ఆ మలాన్ని చీమలు నిర్దేశిత ప్రాంతంలోనే విసర్జిస్తాయని వారు చెప్పారు. అన్ని చీమలు ఆ నిబంధనను కచ్చితంగా పాటిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. చీమలు బాత్రూంగా వినియోగించుకునే ప్రాంతంలో మరే ఇతర పదార్థాలను ఉండనీయవని పరిశోధకులు తెలిపారు.