: రెప్ప పాటులో తప్పిన పెను ప్రమాదం


కనురెప్ప మూసేంతలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బెంగళూరులోని ఎయిర్ షోలో ఈ ఘటన చోటుచేసుకుంది. అశేష ప్రజానీకం చూస్తుండగా రెడ్ బుల్ కు చెందిన మూడు విమానాలు విన్యాసాలు చేశాయి. ఈ సందర్భంగా మూడు విమానాలు అబ్బురపరిచే విన్యాసాలు చేశాయి. అయితే ఎయిర్ షో జరుగుతుండగా, రెండు విమానాలు ఢీ కొట్టుకోబోయాయి. ఒకదానికొకటి నిర్ణీతమైన గ్యాప్ తో వెళ్లాల్సిన మూడు విమాల మధ్య ఓ విమానం, కుడివైపున ఉన్న విమానాన్ని ఢీ కొట్టబోయింది. దీనిని గమనించి, కుడివైపు విమానాన్ని నడుపుతున్న మహిళా పైలట్ అప్రమత్తమై దానిని దూరంగా తీసుకెళ్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై రెడ్ బుల్ యాజమాన్యం దర్యాప్తు ప్రారంభించింది. ఈ తప్పిదం, విమానానికి సూచనలు ఇచ్చిన వారిదా? లేక విమానం నడిపిన పైలట్ దా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కళ్ల ముందు పెను ప్రమాదం తృటిలో తప్పడంతో వీక్షకులు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News