: భయంతో పరుగులు తీసిన తెలంగాణ మంత్రులు, ఎంపీ, ఎంఎల్ఏలు!


తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న ఒక సమావేశ మందిరంలో షార్ట్ సర్య్యూట్ సంభవించడంతో, వీరితోపాటు అధికారులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగింది. ఈ మధ్యాహ్నం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) కార్యనిర్వాహక సమావేశం జరిగింది. సమావేశం జరుగుతుండగా, విద్యుత్ లైన్లలో లోపాల కారణంగా, వైర్లకు నిప్పంటుకొని ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు కాలిపోయాయి. దీంతో, షాక్ కు గురైన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నలతో పాటు సమావేశానికి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News