: మా పోరు ఇస్లాంతో కాదు... ఉగ్రవాదులపైనే: ఒబామా


పశ్చిమదేశాలన్నీ ఇస్లాం మతానికి వ్యతిరేకమని ఉగ్రవాదులు చేస్తున్న ప్రచారాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. తమ పోరు ఇస్లాంతో కాదని, మతానికి వక్రభాష్యాలు చెబుతూ ఉగ్రవాదానికి పాల్పడే వారి పైనేనని స్పష్టం చేశారు. ఈ ఉదయం వైట్హౌస్లో జరిగిన తీవ్రవాద వ్యతిరేక సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, ఐఎస్ఐఎస్, అల్ ఖైదా వంటి సంస్థల తీరును ముస్లిం ప్రపంచమంతా వ్యతిరేకిస్తోందని అన్నారు. ఇస్లాం రాజ్యస్థాపన అంటూ ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్న ఉగ్రవాదులు పేద ముస్లింల జీవన స్థితిగతులను పట్టించుకోలేదని విమర్శించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇస్లాంను వ్యతిరేకిస్తున్నాయన్న అవాస్తవాన్ని యువత మెదళ్లలో నూరిపోస్తూ, ఉగ్రసంస్థలు తమ బలాన్ని పెంచుకునే యత్నంలో ఉన్నాయన్నారు. తాము తలపెట్టిన ఉగ్రవాద వ్యతిరేక పోరుకు సహకరించాలని ప్రపంచ దేశాలను ఆయన కోరారు.

  • Loading...

More Telugu News