: లోపల క్రూరత్వం, పైకి శాంతి... ఇండియాపై విరుచుకుపడ్డ పాకిస్తాన్
పైకి శాంతి వచనాలు పలుకుతున్న భారత్, అంతర్గతంగా దుర్మార్గపు ఆలోచనలు చేస్తోందని పాకిస్తాన్ విరుచుకుపడింది. అరేబియా సముద్ర జలాల్లో ఒక బోటును పెల్చివేయమని తాను స్వయంగా ఆదేశించినట్టు గుజరాత్ తీరప్రాంత రక్షక దళం డీఐజీ స్వయంగా వెల్లడించిన నేపథ్యంలో పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. "అంతర్జాతీయ నియమావళిని ఇండియా మరోసారి ఉల్లంఘించింది. మానవత్వాన్ని మంతగాలిపింది. సంజౌతా రైలు ప్రమాదం వంటి ఘటనలలో మాపై నిరాధార, అబద్దపు ఆరోపణలు చేస్తూ, నలుగురు అమాయకులను పొట్టనబెట్టుకుంది" అని విమర్శించారు. కాగా, తొలుత ఆ బోటును తానే పెల్చివేయమన్నట్టు చెప్పిన గుజరాత్ డీఐజీ తరువాత మాటమార్చిన సంగతి తెలిసిందే.