: రైల్వే ఛార్జీలు తగ్గించే అవకాశం లేదు: రైల్వే సహాయమంత్రి


వచ్చే 26వ తేదీన పార్లమెంటు సమావేశాల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వే ఛార్జీల పెంపు, తగ్గింపు అంశాలపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ఛార్జీలు తగ్గించే అవకాశం లేదని కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. ఇప్పటికే ఛార్జీలు తక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. మంత్రిత్వ శాఖకు చాలా అవసరాలున్నాయని, కానీ వనరులు పరిమితంగా ఉన్నాయని, ఈ క్రమంలో బడ్జెట్ సమతుల్యంగా ఉంటుందని అన్నారు. ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News