: ఢిల్లీ సచివాలయంలోకి మీడియాకు నో ఎంట్రీ: మీడియా రూంకే పరిమితమన్న సర్కారు


ఢిల్లీ పాలన పగ్గాలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ నేడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఢిల్లీ సచివాలయంలో మీడియా ప్రతినిధులు ఇష్టారాజ్యంగా తిరగడానికి కుదరదట. సెక్రటేరియట్ లోని మీడియా రూంకు మాత్రమే మీడియా ప్రతినిధులను పరిమితం చేస్తూ ఐదుగురు సభ్యుల కమిటీ తీర్మానించింది. ఈ కమిటీలో అటు ప్రభుత్వ అధికారులతో పాటు ఇటు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. సచివాలంలో అనవసర ప్రతిష్టంభనకు చెక్ పెట్టేందుకే ఈ దిశగా నిర్ణయం తీసుకున్నామని కేజ్రీవాల్ ప్రభుత్వం చెబుతోంది. ఇకపై ప్రభుత్వంలోని ఏ అధికారిని కలవాలన్నా, మీడియా ప్రతినిధులు ముందుగా ప్రభుత్వ అధికార ప్రతినిధి నాగేంద్ర శర్మను కలిసి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News