: ఏప్రిల్‌ లో ఏపీకి రానున్న సోనియా


మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సోనియా సభను నిర్వహిస్తామని ఏపీసీసీ అధినేత రఘువీరారెడ్డి వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్‌లో ఒత్తిడి తీసుకురావాలని నేటి ఉదయం ఆమెను కలిసిన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, కేవీపీ రామచంద్రరావు తదితరులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నెలలో సోనియాగాంధీని రాష్ట్రానికి ఆహ్వానించగా ఆమె అంగీకరించినట్టు రఘువీర తెలిపారు. ఈలోగా, ప్రత్యేక హోదాపై కోటి సంతకాలు పూర్తి చేసి ప్రధానికి సమర్పిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News