: ముస్లింల తొలి దైవం శివుడే... అయోధ్యలో ముస్లిం మత గురువు వ్యాఖ్యలు
ముస్లింల తొలి దైవం పరమ శివుడేనని, ముస్లింలందరూ ఒకప్పుడు సనాతన ధర్మాన్ని పాటించేవారని జమైత్ ఉలేమాకు చెందిన మతగురువు ముఫ్తీ మొహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనల్ని సృష్టించింది శివపార్వతులేనని కూడా ఆయన అన్నారు. "మేము ఇండియాను హిందూ దేశంగా ప్రకటించడాన్ని వ్యతిరేకించము. చైనా, జపాన్ లో నివసిస్తున్నవారిని ఎలాగైతే చైనీయులు, జపనీయులు అంటామో, అలాగే మనల్ని హిందుస్తానీ అనవచ్చు" అన్నాడు. జమైత్ ఉలేమాకు చెందిన పలువురు మత నాయకులు అయోధ్యను సందర్శించారు. ఈనెల 27న జరిగే మత హింస వ్యతిరేక సదస్సుకు హాజరుకావాలని పలువురు సాధునేతలను వారు కోరారు.