: అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించేందుకు అవికా గోర్ ‘నో’ చెప్పిందట!
అవికా గోర్... చిన్నారి పెళ్లి కూతురుగా స్మాల్ స్క్రీన్ ను అదరగొట్టేసి, ఉయ్యాలా... జంపాలతో టాలీవుడ్ బిగ్ స్క్రీన్ ను కూడా షేక్ చేసింది. అతి తక్కువ పాత్రలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన అవికా గోర్, తాజాగా ఓ బిగ్ ఆఫర్ ను తిరస్కరించిందట. అది కూడా చోటా బచ్చన్ అభిషేక్ బచ్చన్ షోలో నటించమని అడిగితే... కాదు పొమ్మందట. ఫరా ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సదరు షోలో అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించమని అవికాతో పాటు ‘ససురల్ సిమర్ కా’లో ఆమె సోదరిగా నటించిన దీపికా సాంసన్ ను కూడా నిర్మాతలు అడిగారట. అయితే ఆ అమ్మాయిలిద్దరూ నిర్మాతల కళ్లు బైర్లు కమ్మే రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. దీంతో నిర్మాతలు నిరాశగా వెనుదిరిగారట.