: తెలంగాణలో ఇక సెటిలర్స్ అనే పదం ఉండదు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఇకపై సెటిలర్స్ అనే పదమే ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లాలో పుట్టిన తాను హైదరాబాదీనని చెప్పారు. హైదరాబాదులో ఉన్నవాళ్లంతా తెలంగాణ వారేనని పేర్కొన్నారు. నగరంలో స్థిరపడ్డ సీమాంధ్రులతో త్వరలో ఓ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కొద్దిసేపటి కిందట పలువురు కూకట్ పల్లి ప్రాంత వాసులు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయవాదం లేదని, సీమాంధ్రులపై ఎలాంటి వివక్ష చూపదని స్పష్టం చేశారు. మీ తండ్రులు, తాతల నుంచి ఇక్కడ మీరంతా స్థిరపడ్డారన్నారు.