: పెద్ద పెద్దోళ్లంతా మాయమవుతుంటే... ఉపాధ్యాయులు లేని విద్యార్థులమయ్యాం: ఎల్బీ శ్రీరామ్
ఏనాటికైనా అందరూ మరణించాల్సిందే అయినప్పటికీ, తెలుగు సినీ పెద్దలంతా ఇలా హఠాత్తుగా మాయం అయిపోతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు నటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్ అన్నారు. తెలుగు సినిమా రంగం పాఠశాలలో ఉపాధ్యాయులు లేని విద్యార్థులుగా మిగిలిందని ఆయన అన్నారు. రామానాయుడు భౌతికకాయానికి ఆయన నేడు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే నిర్మాతలకు ఆయన దీపం వంటివారని, ఉన్నత శిఖరాలకు ఎదగాలనుకునేవారికి ఎవరెస్ట్ శిఖరమని కొనియాడారు. ఆయన చిత్రాల్లో నటిస్తూ, యూరప్లోని అన్ని దేశాలనూ చూడగలిగానని చెప్పారు.