: డేరా బాబా... ఓ గాడిద: రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు


డేరా సచ్చా సౌద చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ పై బాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విరుచుకుపడ్డారు. బాబా తాజా చిత్రం ఎంఎస్జీ చిత్రాన్ని ఆధారం చేసుకుని విమర్శలు గుప్పించిన వర్మ, తన స్థాయిని మరిచి అసభ్య పదజాలంతో కూడిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బాబాను గాడిదగా అభివర్ణించిన వర్మ, అతడో ‘క్రాస్ బ్రీడ్’ అంటూ మరింత జుగుప్సాకర పదజాలం ఉపయోగించారు. ఈ నెల 13న ట్విట్టర్ వేదికగా మొదలైన వర్మ అనుచిత వ్యాఖ్యలు రోజురోజుకూ పదునెక్కాయి. ఎంఎస్జీ ద్వారా డేరా బాబా తన అనుచరులకు అపకారం చేయడమే కాక తనకు తాను కీడు చేసుకున్నారని కూడా వ్యాఖ్యానించారు. చిత్రం ద్వారా డేరా బాబా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్టుగానే భావించాల్సి వస్తుందని కూడా వర్మ తేల్చేశారు. వర్మ పరుష వ్యాఖ్యలతో డేరా బాబా అనుచరులు షాక్ కు గురయ్యారు.

  • Loading...

More Telugu News