: ఢిల్లీ ప్రజలకు విద్యుత్ రాయితీ ఇవ్వబోతున్న ఆప్
అపూర్వ విజయంతో తమను అధికారంలో కూర్చోబెట్టిన ఢిల్లీ ప్రజలకు ప్రభుత్వం పరంగా కొన్ని రాయితీలు కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో గతేడాది పెంచిన విద్యుత్ ఛార్జీల విషయంలో ఊరట కల్పించాలనుకుంటోంది. ఛార్జీలలో ప్రజలకు రాయితీ కల్పించాలనుకుంటున్నట్లు ఆప్ సర్కారు తెలిపింది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ, ఢిల్లీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అధికారులతో ఓ సమావేశం ఏర్పాటుచేశామని చెప్పారు. డిస్కంల కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఆడిట్ పూర్తయ్యేవరకు విద్యుత్ టారిఫ్ లు పెంచవద్దని అధికారులకు తెలిపాయని పేర్కొన్నారు. విద్యుత్ రాయితీపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రకటనలో వెల్లడించారు.