: మాజీ మంత్రి సోమశేఖర్ మృతి
హిందూపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు సోమశేఖర్ (78) హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. సోమశేఖర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన లేపాక్షి మండలం దేమకేతపల్లిలో రేపు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సోమశేఖర్ 1971 నుంచి 1976 వరకు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మంత్రి వర్గంలో పనిచేశారు. అనంతరం ఎన్టీఆర్ ప్రభంజనం కారణంగా ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన మృతిపట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు.