: పార్లమెంటులో పోరాడని కేసీఆర్... ప్రజలతో చెలగాటమాడుతున్నారు: మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిన్నటి విపక్షాల దాడిలో సికింద్రాబాదు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనదైన శైలి చూపారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడూ పోరాడలేదని అంజన్ ఆరోపించారు. ఎంపీగా ఉన్న కేసీఆర్, ఏనాడూ పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాడిన దాఖలా లేదన్నారు. తెలంగాణ కోసం చట్టసభలో పారాడటం చేతకాని కేసీఆర్, సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. చెస్ట్ ఆస్పత్రి, సచివాలయం తరలింపు లాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని అంజన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.