: రామానాయుడికి నివాళి అర్పించిన కేసీఆర్
మూవీ మొఘల్ రామానాయుడి పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. రామానాయుడు స్టూడియోస్ కు వెళ్లిన కేసీఆర్... నాయుడి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం, అక్కడే ఉన్న సురేష్ బాబు, వెంకటేష్, రానాలను ఓదార్చారు. ఆ సమయంలో కేసీఆర్ వెంట హోం మంత్రి నాయిని, టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు కూడా ఉన్నారు. ఈ మధ్యాహ్నం రామానాయుడి అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.