: అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేయండి: ఢిల్లీ కోర్టు


ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. గత ఏడాది విద్వేష పూరిత ప్రసంగం చేసినందుకు ఒవైసీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రధాని మోదీపై ఓ ఆన్ లైన్ న్యూస్ పేపర్ లో విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారంటూ... అజయ్ గౌతమ్ అనే సామాజిక కార్యకర్త గత జూన్ 5వ తేదీన ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన మొట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మునీశ్ గార్గ్... ఐపీసీ కింద తగిన సెక్షన్లతో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News