: నాయుడుగారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు... ఆదేశించిన సీఎం కేసీఆర్


తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన మూవీ మొఘల్ రామానాయుడి అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగనున్నాయి. 2 గంటల వరకు ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం, రామానాయుడు స్టూడియోస్ లో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కేసీఆర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News