: రామానాయుడు స్టూడియోకు మూవీ మొఘల్ పార్థివదేహం తరలింపు
భారత చలనచిత్ర పరిశ్రమలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మూవీ మొఘల్ రామానాయుడి పార్థివ దేహాన్ని ఆయన సొంత స్టూడియో (రామానాయుడు)కు తరలిస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని తరలిస్తున్న వాహనం వెంట వందలాది అభిమానులు కదలివెళ్తున్నారు. సినీప్రముఖులు సైతం అశ్రునయనాలతో ఆయన భౌతికకాయం వెంట వెళుతున్నారు. అభిమానులు, ఆప్తుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని రామానాయుడు స్టూడియోలో మధ్యాహ్నం వరకు ఉంచుతారు. అనంతరం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. రామానాయుడి పార్థివదేహాన్ని కడసారి దర్శించుకునేందుకు స్టూడియో వద్దకు భారీగా అభిమానులు తరలి వస్తున్నారు.