: అవును... స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డా: పాక్ క్రికెటర్ సల్మాన్ భట్


స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఒప్పుకున్నాడు. 2010లో ఇంగ్లాండుతో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో తాను స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడడమే కాక ఫిక్సింగ్ లో పాల్గొనాలని జట్టు సభ్యులు మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమీర్ లకు కూడా ఆదేశాలు జారీ చేశానని అతడు ఒప్పుకున్నాడు. మొన్నటిదాకా తనకే పాపం తెలియదని చెబుతూ వస్తున్న భట్, తాజాగా పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ తో భేటీ సందర్భంగా తన నేరాన్ని అంగీకరించినట్లు పీసీబీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News