: మైసూరు యువరాజ వేడుకకు బంగారు ఆహ్వాన పత్రికలు
త్వరలో మైసూరు రాజుగా పట్టాభిషిక్తుడు కానున్న యదువీర్ గోపాలరాజ అరసు దత్తత స్వీకార మహోత్సవానికి బంగారంతో అక్షరాలు పొదిగిన ఆహ్వాన పత్రికలను తయారు చేయించారు. వీటిని ఒక్కోటి రూ.20 వేలకు పైగా ఖర్చుతో చేసినట్టు తెలుస్తోంది. దగ్గరి బంధువులు, ముఖ్యులు, వీఐపీలకు మాత్రమే ఈ ఆహ్వానం పంపనున్నారు. ఈ నెల 23న ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మైసూరు ప్యాలెస్లో సంప్రదాయ విధానంలో దత్తత స్వీకార మహోత్సవం జరగనుంది. ఆ తరువాత గోపాలరాజ అరసుకు పట్టాభిషేకం జరుగుతుంది. మైసూరు రాజ వంశీకుడిగా వడయార్ సోదరి గాయత్రీ దేవి మనవడు యదువీర్ గోపాలరాజ అరసును ఎంపిక చేసినట్లు శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ సతీమణి రాణి ప్రమోదాదేవి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. యదువీర్ ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. దత్తత అనంతరం ఆయన పేరు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్ గా మారనుంది.