: తాత్కాలికం వద్దు... శాశ్వతమే ముద్దు: నవ్యాంధ్ర రాజధానిపై ఏపీ సర్కారు పునరాలోచన


రాష్ట్ర విభజన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా కొత్త రాజధాని నుంచి పరిపాలనను సాగించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తుళ్లూరులో నవ్యాంధ్ర కొత్త రాజధాని నిర్మాణాన్ని వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజధాని నిర్మాణం అంటే, రోజుల వ్యవధిలో పూర్తయ్యే పని కాదు కదా. ఏళ్ల కాలం పడుతుంది. ఈలోగా గుంటూరు మిర్చి యార్డులో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక రాజధాని ఏర్పాటు వ్యయం, సదరు నిర్మాణాలు పూర్తయ్యేందుకు పట్టే సమయం పరిశీలించిన చంద్రబాబు సర్కారు, సదరు ప్రతిపాదనలను దాదాపుగా పక్కనబెట్టేసిందట. కారణమేంటంటే, తాత్కాలిక రాజధాని నిర్మాణాలు పూర్తి కావడానికి ఏడాది కాలం పడుతుందట. అంతేకాక సదరు నిర్మాణాలకు రూ.300 కోట్లు ఖర్చవుతాయని తేలింది. అదే సమయంలో కొత్త రాజధానిలో పాలన సాగించేందుకు అవసరమయ్యే ఏర్పాట్ల కోసం రెండేళ్లలో కేవలం రూ.800 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందట. దీంతో తాత్కాలిక రాజధాని ప్రతిపాదనను ప్రభుత్వం దాదాపుగా పక్కనపెట్టేసినట్టేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News