: ఆంధ్రా బ్యాంకు తనఖాలో అగ్రిగోల్డ్ హెడ్ ఆఫీస్... బ్యాంకుకు రూ.100 కోట్ల మేర బకాయి!


అగ్రిగోల్డ్ మహామోసంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. డిపాజిట్ల పేరిట జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టిన అగ్రిగోల్డ్, ఆంధ్రా బ్యాంకు నుంచి దాదాపు రూ.100 కోట్లకు పైగా రుణం తీసుకుంది. ఈ రుణం తీసుకునే సమయంలో విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థకు చెందిన ఇతర ప్రాంతాల్లోని స్థిరాస్తులను కూడా తనఖా పెట్టింది. గడువు తీరిన బాండ్లకు సంబంధించి డిపాజిటర్లకు సొమ్ము చెల్లించని అగ్రిగోల్డ్, బ్యాంకు వద్ద తీసుకున్న రుణానికి సంబంధించిన వాయిదాల చెల్లింపులోనూ విఫలమైంది. నిన్నటిదాకా నోరెత్తని బ్యాంకు యాజమాన్యం, సంస్థ మోసం బయటపడటంతో తాజాగా మేల్కొంది. తన వద్ద తనఖా పెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసేందుకు ఆంధ్రా బ్యాంకు సమాయత్తమవుతోంది.

  • Loading...

More Telugu News