: నేడు సినిమా థియేటర్లనూ మూసేస్తాం: దాసరి నారాయణరావు
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మృతికి సంతాపంగా నేడు తెలుగు సినిమా పరిశ్రమ బంద్ ను పాటించనున్నట్లు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలు బంద్ పాటిస్తాయని ఆయన చెప్పారు. బంద్ లో భాగంగా చలన చిత్రాల నిర్మాణంతో పాటు సినిమా ప్రదర్శనను కూడా నిలిపివేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో నేడు సినిమా థియేటర్లను మూసివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేన్సర్ కారణంగా నిన్న మధ్యాహ్నం రామానాయుడు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.