: ముంబైలో ఫ్లాట్స్ కు లండన్ లో భలే గిరాకీ
ముంబైలో 117 అంతస్తులతో నిర్మిస్తున్న అత్యంత విలాసవంతమైన 'వరల్డ్ వన్ టవర్స్'లో ఫ్లాట్స్ ను లండన్ వాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని భవన నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాల జాబితాలో ఉన్న ఈ అపార్ట్ మెంట్ వచ్చే ఏడాది పూర్తి కానుంది. కాగా, ఇక్కడ ఒక్కో ఫ్లాట్ విలువ కనీసం 1.4 మిలియన్ పౌండ్లు ఉంటుంది. 442 మీటర్ల ఎత్తులో 205 మిలియన్ పౌండ్లకు పైగా ఖర్చు చేసి ఈ టవర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో 300 అత్యంత విలాసవంతమైన ఫ్లాట్స్ ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు లండన్ లో మిలియనీర్లు ముందుకు వస్తున్నారు. లండన్ లో ఉంటున్న భారతీయులు, అప్పుడప్పుడు భారత్ కు వచ్చే భారత సంతతికి చెందిన మిలియనీర్లు ఈ ఫ్లాట్స్ కొనేందుకు ఆసక్తి చూపుతుండడంతో లండన్ లో ఈ ఫ్లాట్స్ అమ్మకం ప్రారంభించారు.