: సచిన్ తో డిన్నర్ చేయాలనుందా?


మీరు సచిన్ అభిమానా ... ఆయనతో కలసి డిన్నర్ చేస్తూ ముచ్చట్లాడాలనుందా... ఇంకా సెల్ఫీలు గట్రా తీయించుకుంటూ మధురానుభూతిని పొందాలనుందా? అయితే ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే. వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 22న) సిడ్నీలోని ఓ ప్రఖ్యాత రెస్టారెంట్ లో 60 మందితో కలిసి సచిన్ డిన్నర్ చేయనున్నారు. ఈ 60 మందిలో మీరూ ఒకరు కావాలనుకుంటే 70 వేల రూపాయల నుంచి 1.40 లక్షల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడాలి. 'ముందు వచ్చిన వారికి ముందు' పద్ధతిన ఈ ఆపర్ వర్తిస్తుంది. ఈ విందు ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని సచిన్ పేరిట నిర్వహిస్తున్న ఓ స్వచ్చంద సంస్థకు అందించనున్నారు. పొరపాటున 22న మిస్ అయినా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన తరువాత అంటే మార్చి 29న మెల్ బోర్న్ లో కూడా మరో విందు జరగనుంది. అందులో కూడా పాల్గోవచ్చు. అభిమానులకు తనతో కలసి భోజనం చేశామన్న తృప్తితో పాటు, సామాజిక సేవలో పాల్గొనే అవకాశం కూడా సచిన్ కల్పిస్తున్నాడు.

  • Loading...

More Telugu News