: రామానాయుడు నుంచి ఎంతో నేర్చుకున్నా: కమలహాసన్
మూవీ మొఘల్ రామానాయుడు నుంచి ఎంతో నేర్చుకున్నానని ప్రముఖ నటుడు కమలహాసన్ తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, భారతీయ సినీ రంగానికి రామానాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రామానాయుడు నుంచి ప్రతి నిర్మాత ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పారు. రామానాయుడు లాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమని ఆయన తెలిపారు. రామానాయుడులాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని కమలహాసన్ పేర్కొన్నారు.