: రామానాయుడు పరిశ్రమకు ఎంతో సేవ చేశారు: కైకాల సత్యనారాయణ


మూవీ మొఘల్ డి.రామానాయుడు తెలుగు చలనచిత్ర రంగానికి ఎంతో సేవ చేశారని ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పేర్కొన్నారు. రామానాయుడు పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సినీ రంగానికి ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, లెక్కలేనంత మంది టెక్నీషియన్లను ఆయన పరిచయం చేశారని అన్నారు. సినీ రంగం హైదరాబాదు రావాలన్న తలంపుతో సకల సౌకర్యాలతో ఆయన నిర్మించిన స్టూడియోలో ఒకసారి స్క్రిప్టుతో ప్రవేశిస్తే, సినిమాను పూర్తి చేసుకుని రావచ్చని అన్నారు. దేశ భాషల్లో ఎన్నో సినిమాలు తీసిన ఆయన అందరితోనూ ఆప్యాయంగా ఉండేవారని చెప్పారు. రామానాయుడు తెలుగు సినీ రంగానికి అందిన బహుమతి అని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News