: రామానాయుడితో 48 ఏళ్ల అనుబంధం నాది: కృష్ణ
నిర్మాత రామానాయుడు మృతి చెందడం బాధాకరమని సీనియర్ నటుడు కృష్ణ అన్నారు. ఆయనతో తనది 48 ఏళ్ల అనుబంధమని పేర్కొన్నారు. రామానాయుడు నిర్మాతగా ఎన్నో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించానని, ఆయన తనతో ఎంతో చనువుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. విజయనిర్మల కూడా రామానాయుడు మృతిపై స్పందించారు. ఆయన మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ ఈ రెండేళ్లలో అనేకమంది ప్రముఖులను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.