: జెనీవా హెచ్ బీసీ కార్యాలయంలో తనిఖీలు
బ్రిటీష్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ బీసీ జెనీవా ప్రధాన కార్యాలయంలో ఈ రోజు తనీఖీలు నిర్వహించారు. తమ క్లయింట్లు మిలియన్ డాలర్ల పన్నులు చెల్లించకుండా తప్పించుకునేందుకు బ్యాంకు సహాయం చేసిందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మనీ ల్యాండరింగ్ దర్యాప్తు చేయాలని జెనీవా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో బ్యాంకు కార్యాలయంలో సోదాలు చేశారు. తీవ్రమైన నగదు బదిలీ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే నేర విచారణ ప్రారంభించామని లాయర్ తెలిపారు. బ్యాంకులో నగదు దాచుకున్ని వ్యక్తులపైన విచారణ మొదలవుతుందని పేర్కొన్నారు.