: 13 ఏళ్ల కింద ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డ రామానాయుడు


మూవీ మొఘల్ గా, వందకు పైగా సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ గా పేరుగాంచిన రామానాయుడు... దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలు తీశారు. టాప్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని పాప్యులారిటీ రామానాయుడి సొంతమంటే అతిశయోక్తి కాదు. వయసు మీద పడుతున్నా, చలాకీతనం ఏమాత్రం తగ్గని రామానాయుడు 13 ఏళ్ల క్రితం ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారు. దీనికి ఆయన పలుమార్లు చికిత్స తీసుకున్నారు. వైద్యం కోసం విదేశాలకు సైతం వెళ్లారు. ఈ క్రమంలో, ఆయన కోలుకుంటున్నారు అనుకుంటుండగానే... ఆ మహమ్మారి మరోసారి తిరగబడింది. సినీనటుడు రాజశేఖర్ (ఈయన డాక్టర్ కూడా) కూడా రామానాయుడికి చికిత్స చేస్తున్న తీరును పర్యవేక్షిస్తుండేవారు. ఈ పరిస్థితుల్లో, అందరినీ శోకసంద్రంలో ముంచుతూ సినీకళామతల్లి ముద్దుబిడ్డ రామానాయుడు ఈ లోకాన్ని వీడారు.

  • Loading...

More Telugu News