: కారంచేడు కదిలింది
ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు ఆకస్మిక మృతి వార్త విన్న ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా కారంచేడు విషాదంలో మునిగిపోయింది. ఎంపీగా, నిర్మాతగా గ్రామానికి సేవలందించిన రామానాయుడు ఇకలేరన్న బంధువులు, ఆత్మీయులు విషణ్ణవదనులై హైదరాబాదు బయల్దేరారు. కారంచేడులో ఆయన అభిమానులు కూడా హైదరాబాదు బయల్దేరారు. సినిమా నిర్మాతగానే కాక, వ్యక్తిత్వం పరంగా కూడా రామానాయుడు ఆదర్శనీయుడంటూ ఆయన బంధువులు పేర్కొంటున్నారు. రామానాయుడు మృతి సినీ రంగానికే కాక కారంచేడుకు కూడా తీరని లోటని వారు అభిప్రాయపడ్డారు.