: అమెరికాలో షిరిడి సాయి డ్రామా... తొలిసారి తెలుగులో ప్రదర్శన!
అమెరికాలోని తెలుగువారు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడానికి చేస్తున్న కృషిని హర్షించకుండా ఉండలేం. ఇక్కడున్న వారు అన్నింటినీ మరచిపోతున్నా, అక్కడి తెలుగు వారు మాత్రం మన గొప్పదనాన్ని కాపాడుకోవడానికి అహర్నిశలూ శ్రమిస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలో, యూఎస్ లోని నెబ్రస్కా రాష్ట్రంలో ఉన్న ఒమహా సిటీలో ఈ నెల 14న 'లలిత కళా మండలి' అనే సంస్థను అట్టహాసంగా ప్రారంభించారు. సంస్థ ఆరంభ వేడుకల సందర్భంగా, శ్రీ షిరిడీ సాయిబాబా నాటిక (డ్రామా)ను ప్రదర్శించారు. ఈ డ్రామా గొప్పదనమేమిటంటే... సాయి నాటికను తొలిసారిగా తెలుగులో ప్రదర్శించడం. ఈ నాటిక దాదాపు 2 గంటలపాటు కొనసాగింది. అంతేకాకుండా దుర్గె దుర్గె కీర్తనకు భరతనాట్యం, ముకుందా ముకుందా నృత్య రూపకాలను ప్రదర్శించారు. దాదాపు 350 మంది ఈ కార్యక్రమానికి హాజరై, ఆసక్తిగా తిలకించారు. దీనికి తోడు మృదంగ వాద్యం ఆహూతులను అమితంగా అలరించింది. ఈ కార్యక్రమానికి అమల దుగ్గిరాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లలిత కళా మండలి సమర్పించిన ఈ శ్రీ షిర్డి సాయి బాబా డ్రామాలో నటించిన వారు: సాయి బాబా: రవి కందాల బావుగిరి: రంగనాథ్ మందల మహల్సాపతి: శ్రీనివాస్ తూటిక నానా చందోర్కర్: ప్రసాద్ కొల్లి బాయాజీ బాయి: అపర్ణ నేదునూరి లక్ష్మీబాయి: శ్వేత వెల్లంకి చాంద్ పాటిల్: వేణు గోపాల్ బోయినపల్లి తాత్యా: వేణు వెల్లంకి స్యామా: దుర్గా చిగులూరి బుట్టీ: నారాయణ కోలూర్ నానావళి: వేణు కొత్తె శ్రీ రాముడు: రాధా కృష్ణ పొన్నత దాసగణు: శిరీష్ కంది రచన , స్క్రీన్ ప్లే , దర్శకత్వం: శివ రామ కృష్ణ గంగా